Sunday 14 December 2014

ముగ్గురు కొడుకులు



అనగనగా ఒక ఆమె. ఆమెకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు ఏమీ పని చేయడు. పెద్దకొడుకు, రెండో కొడుకు చేపలు పట్టడానికి వెళ్తారు. చిన్నకొడుకుకు లోకం తెలియదు. ఎప్పుడూ ఇల్లిల్లూ తిరుగుతూ అందరికీ పేలు చూస్తాడు. చిన్న కొడుకంటే తల్లికి చాలా ఇష్టం. ఓనాడు పెద్దకొడుకు భార్యకు కోపం వచ్చింది.
    కష్టపడి వచ్చేది మనం. ఊరకే తినికూచ్చునేది మాత్రం మీ తమ్ముడా. ఎంతకాలం ఇట్లా నావల్లకాదు అనింది. కానీ మా అమ్మకు వాడంటే చాలా ఇష్టం కదా మరి ఎట్లా అన్నాడు పెద్దకొడుకు. చివరకు ఒకరితో ఒకరు మాట్లాడుకొని  చిన్నకొడుకును చంపేయాలి అనుకున్నారు.
    అప్పుడు ఒక పాము వాళ్ళకు కనిపించింది. దాన్ని చంపి, బాగా కడిగి తీసుకోనొచ్చారు. తల్లికి చేపలని ఇచ్చి వండమన్నారు. అప్పటికి చిన్న కొడుకు ఒకామెకు పేలు చూసి వచ్చాడు. పేలు చూసిన తర్వాత రెండుచేతులతో పేలు చూయించుకున్నవాల్ల తలకు రెండు వైపులా మెటికలు విరిచి రావాల. ఆరోజు ఆమెకు మెటికలు విరచలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయం గుర్తుకు వచ్చింది.
    అమ్మా నేను ఈ రోజు ఒకామెకు పేలు చూసి వచ్చాను. మెటికలు విరచలేదు. మరచి పోయివచ్చాను అన్నాడు. సరే బాబూ,  మెటికలు విరిచి వచ్చినాక తిరిగి వచ్చి అన్నం తిందువుగానీ అన్నది వాళ్ళమ్మ. వాడు మెటికలు విరిచి రావడానికి కొంచెం సమయం పట్టింది. ఇంటికి తిరిగి వచ్చి అన్నం పళ్ళెం మీద మూత తీసి చూసేసరికి అక్కడ బంగారు తునకలు ఉన్నాయి.
    తల్లి విషయం అర్థం చేసుకునింది. నువ్వు ఈ బంగారు తునకలు తీసుకొని ఎక్కడన్నా బతుకు పో నాయనా అన్నది.                                                              
                                                                                                     -మిన్నల్

Thursday 6 November 2014

నీకు ఒక రొట్టె నాకు రెండు రొట్టెలు


   
               ఒక ఊరిలో భార్యాభర్త జంట ఉంది. వాళ్ళు పనికి పోయి చెరి పది రూపాయలు సంపాయించి, వాటితో పడి జొన్నలు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి వాటిని ఇసుర్రాయిలో పోసి ఇసిరిండ్రు. భర్త పచ్చడిలోకి మిరపగాయలు తేవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో భార్య మూడు రొట్టెలు చేసింది. భర్త తెచ్చిన మిరపగాయలతో పచ్చడి చేసింది. భర్త నీకు ఒక రొట్టె, నాకు రెండు రొట్టెలు అన్నాడు. భార్య నీకే ఒక రొట్టె, నాకు రెండు రొట్టెలు అని అడ్డం తిరిగింది. నీకు ఒకటి, నాకు రెండూ అని మొగుడంటే, కాదు నీకే ఒకటి,  నాకు రెండు అని పెండ్లాం తగాదకు తీసుకున్నది.
   
    చివరకు ఇద్దరూ కలిసి ఒక పందెం వేసుకున్నారు. సరే అయితే మనం పందెం పెట్టుకుందాం. ఈ రాత్రి నుంచి తెల్లవారి పొద్దెక్కిందాకా ఎవరైతే కదలకుండా ఉంటరో వాళ్ళకు రెండు రొట్టెలు అని అన్నాడు భర్త. భార్య ఒప్పుకుంది. వాళ్ళు అనుకున్నట్లే అంతా జరుగుతోంది. ఎవ్వరూ కదలడం లేదు.
   
    కానీ పొద్దున్నే పక్క ఇంట్లో వాళ్ళు, ఏమి చప్పుడు లేదే అని వచ్చి చూసారు. వచ్చి వాళ్ళ చెయ్యి పట్టుకొని కదిలించారు. కానీ వాళ్ళు పలకలేదు. కదలలేదు. వాళ్ళు చచ్చిపోయారు అనుకున్నారు. చుట్టుపక్కల అందరూ వచ్చి కొంచెం సేపు ఏడ్చారు. ఇంక వాళ్ళని కాల్చడానికి స్మశానానికి తీసుక పోయారు. వాళ్ళకి అగ్గి పెట్టారు.
   
    మంట సెగ తగిలేసరికి భర్త ఓర్చుకోలేక పక్కకు తిరిగాడు. అప్పుడు భార్య లేచి, ఏయ్ ! ఓడిపోయినావు ఓడిపోయినావు. ఇంక నీకు ఒక రొట్టె నాకు రెండు రొట్టెలు అని చప్పట్లు కొట్టి నవ్వింది. అది చూసిన జనం, వాళ్ళు దయ్యాలు అనుకొని  భయపడి అక్కడి నుంచి పరిగెత్తారు. అప్పుడు వాళ్ళు, ఉండండి, ఉండండి. మేము దయ్యాలం కాదు అని నచ్చచెప్పారు. జరిగిన విషయం చెప్పారు.
   
    అది విన్న జనం, వోర్నీ అని ముక్కున వేలేసుకున్నారు.

                                                                                                                                                                                                                                                                 -మిన్నల్
                                                                                                                                                                                                                                 

Monday 3 November 2014

ఒక బుల్లి రాణీ


ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. అతడికి ఒక పాప పుట్టింది. అతడు పాప పుట్టిందా అని అనుకున్నాడు. పాప పెరుగుతుంది. రాణి ఒక రోజు మన పాపని బడిలో చేరిపిద్దామ అని అన్నది. రాజు ఒప్పుకోలేదు. రాణి అన్నది అందరూ మన పాపని ఎగతాళి చేస్తారు  అని .
అప్పుడు రాజు ఒప్పుకున్నాడు. తను బాగా చదువుకుంటుంది.
    రాజు ఒక విషయాన్ని అలోచించడం రాణి గ్రహించింది. ఏమిటి మీరు దేని గురించో ఆలోచిస్తున్నారు అని అడిగింది. అప్పుడు రాజు చెప్పాడు నాకు ముసలితనం వచ్చేస్తోంది కదా. మన రాజ్యానికి ఎవరిని రాజుని చేద్దాము అని ??????  . అప్పుడు రాణి మన పాపని ఈ రాజ్యానికి రాణిని చేద్దాము అని అన్నది. రాజు, అది ఏంటి ఆడపిల్లలను రాజ్యానికి ఎవరైనా పరిపాలించటానికి అవకాశం ఇస్తారా అని అన్నాడు. కాని  రాణి రహస్యంగా పాపకి  కత్తి యుద్ధం, గుర్రపు యుద్ధం నేర్పిస్తుంది. పాప ముందు ఒప్పుకోలేదు.  కత్తులు, అవి, చూసి నేను నేర్చుకోను అంటుంది . కానీ త్వరగా అన్నీ నేర్చుకుంది.
    కొన్ని రోజుల తరువాత ఒక శత్రురాజు వాళ్ళ మీదకు యుద్ధానికి వచ్చాడు. వాళ్ళు ఉన్నట్టుండి ఒక్కసారిగా  యుద్ధానికి వచ్చేసరికి  సైనికులు బిత్తరపోయారు. రాజు మనం గెలుస్తాము అని అనుకున్నాడు. కానీ సైనికులు  అలసిపోతున్నారు . పాపకి ఈ విషయం తెలిసింది. పాప ఇంతకంటే ముందే ఒక సైన్యాన్ని తయారు చేసుకుంది. ఆ సైన్యంలో  ఒక ఇరవై మందిని పంపిస్తుంది. కాని అవతలి వైపు రాజు ఒక మందుని వాళ్ళ మీద చల్లి వాళ్ళందరిని కింద పడేటట్టు చేసాడు.  ఆమెకి అనుమానం వచ్చింది.  మనం ఓడిపోతామేమో అని . అందుకే పాపే స్వయంగా వచ్చింది.  తన సైన్యాన్ని ముందుకి నడిపింది. పాప గెలిచింది. ఈ సంగతి రాజుకు తెలియదు.  ఈ మంచి వార్తను రాజుకి ఒక భటుడు వచ్చి చెప్పాడు. అది విన్న రాజు యుద్ధంలోకి వచ్చాడు.
    యుద్ధంలో సైనికులను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరు వీళ్ళు మన సైనికులు కాదే. ఎక్కడ వాళ్ళు. వీళ్ళు ఇంత చిన్నగా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలేదు. వీళ్ళ నాయకుడు ఎక్కడ. మన రాజ్యంలోని వాళ్ళేనా. నేను నాయకుడిని కలవాలి అని తొందర పెట్టాడు. భటుడు చాలా వినయంగా వీళ్ళ నాయకుడు అక్కడ ఉన్నాడు ప్రభూ అని నాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాడు.అప్పుడు వీళ్ళ నాయకుడు కూడా చిన్నగా ఉన్నాడే అనుకున్నాడు.
    ఆ నాయకుడి దగ్గరకు పోయి రాజు భుజం తట్టాడు. అప్పుడు   ఆ నాయకుడు శిరాస్త్రాణం తీసింది. అరే నువ్వా పాపా అన్నాడు. బుల్లిరాణిని మెచ్చుకున్నాడు. ఇదంతా ఎట్లా అని అడిగాడు. పాప అన్నీ చెప్పింది.  పాపను రాణీని చేసారు.    

                                                                                                                             -Minnal

Sunday 21 September 2014

విక్రమార్కుడు-పరకాయవిద్య


ఒక ఊరిలో ఒక రాజు. ఆయన పేరు విక్రమార్కుడు.అతనికి ఒకాయనతో స్నేహం కుదిరింది. ఆయన చెడ్డవాడు. విక్రమార్కుడికి పరకాయవిద్య వొచ్చు. విక్రమార్కుడు సావాసగాడికి పరకాయ విద్య నేర్పుతున్నాడు. అది ఎలా ఉంటుందో నేర్పడానికోసం చనిపోయిన చిలుకలోనికి ప్రవేశించాడు. ఇంక మిగిలిన శరీరంలోకి స్నేహితుడు ప్రవేశించాడు. ఇదే బాగుందని అట్టనే ఉండిపోయాడు. చిలుక శరీరంలోకి వెళ్ళిన విక్రమార్కుడు గాలిలోకి ఎగిరిపోయాడు. స్నేహితున్ని రాజు అనుకొని ప్రజలు నమ్మారు.

    విక్రమార్కుని భార్య ఆయన నడక,  అయన మాటల్ని గుర్తు పట్టింది. మంత్రికి కూడ ఈ విషయం తెలిసింది.  ఆ మంత్రి పేరు భట్టి. భార్య, నేను వ్రతం పట్టినాను అని అన్నది. అట్లా దొంగ విక్రమార్కుని నుంచి తప్పించుకున్నది. ఒక పెద్ద కొండ మీద 99 హంసలతో చిలక స్నేహం చేసి వాటితో నివసిస్తున్నది. కొన్ని రోజుల తర్వాత రాత్రి ఒక ముసలి కాకి వచ్చింది. ఏమిటీ విచారంగా ఉన్నావు, అని అడిగింది చిలుక. ఈ రాత్రి మీవద్ద నిద్ర పోతాను అన్నది ముసలి కాకి. కాని హంసలు మాత్రం ఒప్పుకోలేదు. చిలక, పాపం ముసలి కాకిలే అని ఒప్పించింది. ముసలి కాకి ఉదయం లేచి వెళ్ళిపోయింది. కొద్ది రోజులకి అక్కడ ఒక  మర్రి చెట్టు మొలిచింది. కొద్ది సంవత్సరాలకు మర్రి చెట్టు పెద్ద చెట్టు అయ్యింది. అక్కడ ఉన్న హంసలు చెట్టు మీద నిద్రపోవడానికి అలవాటు పడ్డాయి.
      
    ఇదంతా ఒక బోయవాడు చూశాడు. పక్షులను చంపాలని ఉచ్చులు పెట్టాడు. పక్షులు ఇవి గమనించలేదు. పగలు మాత్రం వేటాడి వచ్చిన పక్షులు ఉచ్చులలో వాలి చిక్కుకున్నాయి. బోయవాడు వచ్చేటప్పటికి మనం చనిపోయినట్లు నటించాలి. అప్పుడు ఒక్కొక్క పక్షిని బోయవాడు ఎంచుకుంటాడు. ఉచ్చులు తీస్తాడు. వంద కాంగానే ఎగిరిపోదాం అని చిలక అన్నది.

        తెల్లవారి బోయవాడు వచ్చాడు. అవి ఎలా అనుకున్నాయో అలానే చేసాయి. కానీ బోయవాడి కత్తి కిందపడగానే వంద పక్షులు అయిపోయినాయి అని అనుకొని ఎగిరి పోయాయి. ఇంత మోసం చేస్తారా అని బోయవాదు చిలక గొంతు పిసకబోయ్యుండు. అప్పుడు చిలక,  నన్ను చంపితే నీకు ఏమీరాదు. కనుక నువ్వు నన్ను ఒక ఊరిలో అమ్మితే నీకు డబ్బులయినా వస్తాయి అన్నది. అఖరికి ఒక పేదవాడైన గుగ్గిళ్ళు అమ్మే పొలిశెట్టి, ఎంత చిలక  అని అన్నాడు? పొలిశెట్టి !  నువ్వు నన్ను కొనుక్కొ . నేను నీ చిన్న కొట్టును  పెద్ద కొట్టుగా చెస్తాను  అని అన్నది. పొలిశెట్టి చిలక మాటలు నమ్మి చిలకను యాభై నాణాలకు కొనుక్కున్నాడు. పొలిశెట్టి దగ్గర మాటలు చెప్పే చిలక ఉందని అందరు పోలిశెట్టి అంగడికి వచ్చారు.  సరుకులు బాగా కొన్నారు. చిన్నకొట్టు పెద్దకొట్టు అయ్యింది. చిలక తీర్పులు కూడ చెప్పను మొదులు పెట్టింది. ఆ ఊల్లో రంగసాని ఉంది. బజారున పోయే వాళ్ళను మోసగిచ్చి డబ్బులు వసూలు చేసేది. జనం చిలక దగ్గరకి తీర్పు కొసం పోయారు. ఇది మంచి పద్దతి కాదని చిలక తీర్పు చెప్పింది.  రంగసాని కోపంతోటి ఇంటికి వెల్లి ఆ దేశపు  రాజు దగ్గర స్నేహం కుదుర్చుకున్నది.
                
                    నాకు తల నొప్పివచ్చింది  మాట్లేడే చిలక  రక్తం కావాలి. పోలిశెట్టి దగ్గర చిలక మాట్లాడుతుంది. నాకు అది కావాలి అన్నది. రాజు పోలిశెట్టికి వెయ్యి నాణాలు ఇచ్చి చిలకను తెచ్చాడు. ఆమె ఆ చిలకను తీసుకుని దాసికి ఇచ్చింది. దాసి చిలక బొచ్చును వలుస్తుంది. ఇంతలో పొయ్యి మీద అన్నం పొంగింది. అన్నం పొంగి పోతుందని ఆమె పోయికాడికి పోయింది.  అంతలోకి చిలక గవాజిలోకి తప్పించుక పోయింది. దాసి వచ్చేసరికి చిలక కనబడలేదు. దానికి ఒక పిల్లి కనిపించింది. పిల్లిని చంపి వండి పెట్టింది. గవాజీలోనే ఎంగిలి మెతుకులు తింటా ఉండింది చిలక. రెండు నెలలకు చిలకకు బొచ్చు వచ్చింది. ఇంక చిలక ఎగిరిపోయింది. ఊరి చివర ఒక గుడిలో ఉన్నది. కొన్ని సంవత్సరాల అయినాక  రంగసాని గుడి రావడం గమనించింది. శివుడు ప్రత్యక్షమై రావాలని ఆమె పూజలు చేసేది. ఒక రోజు శివుడిని ఎప్పుడు సామి నాకు ప్రత్యక్షమయ్యేది అని ఆమె  అడిగింది. అప్పుడు శివుని వెనక ఉన్న చిలక నీ ఇల్లు, ఆస్థి దాన ధర్మాలు చేసిరా అని శివుని మాదిరిగా అన్నది. అప్పుడు నేను స్వర్గానికి వెల్తున్నానని వూరు మొత్తం దండోరా వేయించింది . చుట్టు పక్కల ఉండే జనం తిరనాలకు వచ్చినట్టు వచ్చింన్రు. డబ్బులన్నీ వాళ్ళకి పంచింది.
                       అప్పుడు అమె స్వర్గానికి వెళ్ళడానికి ఏమి చెయాలని అడిగింది. శివుని వెనక నుంచి  చిలక , ఉట్టి కట్టు అని అన్నది . మల్లా ఉట్టి మీదకు  ఎక్కు అని అన్నది. నాకు ఉట్టి అందడం లేదని ఆమె అనేసరికి, ఉట్టి ఎక్కలేని దానివి స్వర్గానికి ఎలా ఎక్కుతావు అని చిలక బర్రున లేచి పోయింది.
              విక్రమార్కుని జాడ తెలియ లేదని భట్టి వెతుకుతూ ఉన్నాడు.ఇక్కడ ఎదో తిరనాల జరుగుతూందని దగ్గరకు వచ్చి చూసాడు. చిలక భట్టి భుజాల మీద వాలింది. నేను చిలక రూపంలో ఉన్నాను అని మట్లాడింది. అప్పుడు ఆయన చిలకను తీసుకుని పోయాడు. ఈ సంగతంతా విక్రమార్కుని భార్యకి చెప్పాడు.
               అప్పుడు భట్టి పొట్టెల్ల పందెం ఏర్పాటు చేశాడు. పందెంలో భట్టి తెచ్చిన పొట్టేలు దొంగ రాజు పొట్టేలును కుమ్మి చంపేసింది. అది తట్టుకోలేక దొంగ రాజు పరాకాయ మంత్రంతో పొట్టేలులోకి పోయిండు. చిలక రూపంలో ఉన్న విక్రమార్కుడు తన శరీరంలోకి ప్రవేశించాడు. చెడ్డవాడు పొట్టేలు రూపంలోనే మిగిలి పోయిండు.


(ఈ కత మిన్నలుకు వాళ్ల నానమ్మ శనివారం రాత్రి చెప్పింది. అది విని మిన్నల్  రాసింది)

Sunday 7 September 2014

A Big Palace

Once upon a time there was a big forest,in it there was a very big palace. No body wouldn't go into that palace. Because people think that inside the palace a ghost was there. But there was no ghost. there was a small kid. she was living with her parents. One day she was playing in the forest. she went into the palace while she was playing.

                        It was very old and dirty. Along with her  mother she cleaned the whole palace. Next day also she wanted to go into the palace. along with her friends she went into the palace. When she entered into the palace there was some moss at the gate and she stepped on it. so much water came out from it in a forcible manner.
                     
                     Next day also she went into the palace. she didn't step on the moss. The water wouldn't come. Because it was arranged for preventing the enemies. If enemies tried to enter in side the palace they would be killed by the flushed out water when they stepped on the moss.
                 She went into the kitchen. There were no fruits and vegetables. But in a big almirah there
   was sand. And it was covered with a plastic sheet. She teared the sheet and she found that there were fresh fruits and vegetables. she thought that the kings were very intelligent. Because the kings kept the almirah walls wet and that keeps the fruits and vegetables for a long time.
                           
                          The back of the palace there was a door way. She walked along the way and she found a very beautiful garden filled with fruits and vegetables. she saw the kings and queens. She asked, why were you here. you had a big palace . you couldn't live there? They answered, we could live there. But we felt boredom to live there for a long time.
               
                        She said we cleaned the palace. It was cleaned now. Oh! very thanks, they said. The kings and queens came to the palace. the very good king said, poor people could live in this palace. And the village was very happy then.

                                                                     Minnal
                                                                      4th class
                                                                      R.R UP. School,Giddaluru














                            

Saturday 6 September 2014

లోపలికి ప్రవేశం

ఇక్కడ రాస్తున్నవన్నీ మిన్నల్ విన్న కథలు. చదువుకున్న కథలు. రాయడం కూడా కథను చెప్పడమే కాబట్టి, రాయడాన్ని నేర్చుకోవడానికి ఆమె రాసిన వాటిని దాదాపుగా యథాతధంగా ఉంచుతున్నాను